మన అన్నచెల్లెళ్లని కాల్చి చంపుతున్నారు.. మీకు ఆవేశం రావడం లేదా..ప్రశ్నించరా?..జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్.. మరి కొందరు ట్వీట్ కు…

గాజాలో జరిగిన పరిణామాలను అయ్యో.. పాపం అనుకున్న భారతీయులు, పొరుగు దేశం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా మౌనం వీడాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మూక దాడులను.. హత్యలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. దీపు దాస్ ఉదంతానని ఘోరమని.. అమానవీయమని పేర్కొంటున్నారు. హిందువులు ఇకనైనా మేల్కొనాలంటూ పిలుపు ఇస్తున్నారు.

మౌనం ప్రమాదకరం

యువ నటి జాన్వీ కపూర్ తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘటనలు అమానుషమైనవి.. క్రూరమైనవి. ఇలాంటి ఘటనల పునరావృతం కావడం దారుణం. దీపు చంద్ర దాస్ను మధ్యలోనే అమానుషంగా లించ్ చేసిన ఘటన గురించి చదవాలని, వీడియోలు చూడాలని, ఘటనపై నిలదీయాలి. మనం ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాలపై కన్నీళ్లు కారుసూ. మన సొంత సోదరులు. సోదరీమణులు ఇకడే కాల్చి చంపబడుతున్నారని అన్నారు.. మౌనం వీడకపోతే అమాయకులు ఇలా బలవుతూనే ఉంటారని అన్నారు.

జాన్వీ కపూర్ వంటి కొంత మంది సెలబ్రిటీలు మాత్రమే ”దీపు చంద్ర దాస్” హత్యై స్పందించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ”బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది అనాగరికం. ఇది ఊచకోత, మరియు ఇది ఒక ఏకాకి సంఘటన కాదు. అతని అమానవీయ బహిరంగ మూకదాడి గురించి మీకు తెలియకపోతే, దాని గురించి చదవండి, వీడియోలు చూడండి, ప్రశ్నలు అడగండి. మరియు అయినప్పటికీ ఇవన్నీ చూసి మీకు కోపం రాకపోతే, ఇలాంటి కపటత్వమే మనకు తెలియకుండానే మనల్ని నాశనం చేస్తుంది. మన సొంత సోదరులు మరియు సోదరీమణులు దహనం చేయబడుతుండగా, మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాల గురించి ఏడుస్తూనే ఉంటాం” అని ఆమె అన్నారు.

టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ కూడా బంగ్లాదేశ్ హిందువులకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ”ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్” పోస్టర్‌ను షేర్ చేశారు. ”హిందువులారా మేల్కొనండి, నిశ్శబ్దం మిమ్మల్ని రక్షించదు” అని ఆమె కామెంట్ చేశారు.

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కూడా ఈ ఘటనపై మాట్లాడుతూ.. దీపు చంద్ర దాస్‌ను చంపిన క్రూరత్వం తన హృదయాన్ని రక్తసిక్తం చేసిందని అన్నారు. ” దీపు చంద్ర దాస్ అనే ఒక అమాయక హిందూ వ్యక్తిని మూకదాడి చేసి చంపారు. వారు అతన్ని చంపడమే కాకుండా, ఒక చెట్టుకు కట్టి నిప్పంటించారు. ఇదేనా కొత్త బంగ్లాదేశ్? ఇది సాధారణ హింస కాదు; ఇది మూకదాడి. ఇది హిందూ మతంపై దాడి. మన దేవాలయాలను కూల్చివేస్తున్నారు, మహిళలపై దాడులు జరుగుతున్నాయి, మనం ఇంకెంత కాలం మౌనంగా ఉంటాం? లౌకికవాదం పేరుతో మనం మౌనంగా ఉంటున్నాం, మనం మన గొంతులను వినిపించాలి, అక్కడి ప్రజలకు సహాయం చేయాలి… మనం అందరం కలిసి వారికి న్యాయం జరిగేలా ప్రయత్నించాలి” అని అన్నారు.

సినీ నటుడు మనోజ్ జోషి మాట్లాడుతూ.. గాజా లేదా పాలస్తీనాలో ఏదైనా జరిగితే అందరూ ముందుకు వస్తారు, కానీ బంగ్లాదేశ్‌లో ఒక హిందువును చంపింతే ఎవరూ ముందుకు రాకపోవడం చాలా బాధకరమని, దీనికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. సింగర్ టోనీ కక్కర్, దాస్ హత్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. మత వివక్ష విడనాడాలని పిలుపునిచ్చారు…

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల నటి కాజల్ అగర్వాల్ స్పందించారు. ఆమె తన సోషల్ మీడియా వేదికగాఅక్కడి హిందువుల రక్షణ కోసం గళమెత్తారు. బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లు, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, అమాయక ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం స్పందించాలని ఆమె కోరారు.హిందువులారా మేల్కోండి..ఈ కష్టకాలంలో హిందువులందరూ ఐక్యంగా ఉండాలని, బాధితులకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.

బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ మార్పుల తర్వాత హిందూ సమాజంపై దాడులు పెరిగాయనే వార్తలు వచ్చాయి. దీనిపై కేవలం కాజల్ అగర్వాల్ మాత్రమే కాకుండా, పలువురు సినీ ప్రముఖులు కంగనా రనౌత్, సోను సూద్ వంటి వారు కూడా స్పందించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి సామాజిక, మతపరమైన అంశాలపై నేరుగా స్పందించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. చాలా మంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ మద్దతు తెలుపుతున్నారు….

ఆమెకు గట్స్ ఉన్నాయంటూ నెటిజన్ల ప్రశంసలు

జాన్వీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో, ముఖ్యంగా రెడిట్ లో వైరల్ అవుతోంది. “మార్కెట్ పోతుందనో, ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనో భయపడి మిగతా బాలీవుడ్ స్టార్స్ మౌనంగా ఉంటే.. జాన్వీ మాత్రం ఇస్లామిక్ ఎక్స్‌ట్రీమిజం గురించి ధైర్యంగా మాట్లాడింది. సెలెక్టివ్ హిపోక్రసీ లేకుండా రియాక్ట్ అయ్యింది” అని ఒక నెటిజన్ రాశారు.

మరొకరు స్పందిస్తూ.. “నటిగా ఆమె నాకు పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ సమాజంలో ఏం జరుగుతుందో ఆమెకు అవగాహన ఉంది. మిగతా స్టార్ కిడ్స్ లా కాకుండా.. ఆమెకు నిజాలు మాట్లాడే దమ్ముంది” అని మెచ్చుకున్నారు..

గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959