హోటల్‌ మూసివేతపై వాగ్వాదం…అర్ధరాత్రి బెంగళూరు బస్టాండ్‌ వద్ద ఘటన.

హోటల్‌ మూసివేతపై వాగ్వాదం.

అర్ధరాత్రి బెంగళూరు బస్టాండ్‌ వద్ద ఘటన.

మదనపల్లె,

బెంగళూరు బస్టాండ్‌ పరిసరాల్లో శనివారం అర్ధరాత్రి హోటల్‌ మూసివేత విషయంలో పోలీసులకు, హోటల్‌ నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. నిర్దేశిత సమయం దాటిన నేపథ్యంలో హోటల్‌ను మూసివేయాలని పోలీసులు సూచించగా, దీనిపై ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.

ఘటనపై ఇరువర్గాలు తమ తమ వాదనలు వినిపించాయి. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వాస్తవాలు అధికారుల విచారణ అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది…