భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో నాటు బాంబుల కలకలం..!

భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో నాటు బాంబుల కలకలం

ఒక బాంబును కొరికిన వీధి కుక్క.. పేలుడు ధాటికి ఆ కుక్క మృతి

రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న చెత్త కుప్పలో నాటు బాంబులను గుర్తించిన పోలీసులు

రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా పడి ఉన్న సంచులను చెత్తకుప్పలో పడేసిన రైల్వే పారిశుద్ధ్య సిబ్బంది

మూడు సంచుల్లో ఐదు బాంబులు ఉండగా, ఒక బాంబు కొరికి కుక్క మృతి

మరో నాలుగు బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఉదయం వెళ్లే రైలులో నాటు బాంబులను తరలించేందుకు ఎవరో ప్రయత్నించి ఉంటారని పోలీసుల అనుమానం….

రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా పడి ఉన్న సంచులను రైల్వే పారిశుధ్య సిబ్బంది చెత్తకుప్పలో పడేశారు. మూడు సంచుల్లో ఐదు బాంబులు ఉండగా, ఒక బాంబు కొరికిన‌ కుక్క మృతి చెందింది. మరో నాలుగు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఉదయం వెళ్లే రైలులో నాటు బాంబులను తరలించేందుకు ఎవరో ప్రయత్నించి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు…