టీడీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలాలు ఉన్న నాయకుల చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది..భార్గవ్ దేశ్ పాండే .
టీడీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలాలు ఉన్న నాయకుల చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది..
నేను 2006 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను.. ఆరోజు ఉన్న కాంగ్రెస్ కాదు ఇప్పుడున్న కాంగ్రెస్..
ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఈ ముగ్గురు పూర్తిగా రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయారు..
రాహుల్ గాంధీ ఢిల్లీలో చెప్పే మాటలకు తెలంగాణలో పూర్తి విరుద్ధంగా పాలన నడుస్తుంది..
కేవలం రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఎందుకు టీడీపీని అధికారంలోకి తీసుకురాలేదు?..
ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు ఐదుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు..
ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు.. తెలుగుదేశం, RSS కాంగ్రెస్..లీవ్ కాంగ్రెస్.. సేవ్ తెలంగాణ
..- మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్పాండే.
ఆదిలాబాద్ మాజీ డీసీసీ అధ్యక్షుడు, జిల్లా యువ నాయకుడు భార్గవ్ దేశ్ పాండే కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. భార్గవ్ దేశ్ పాండేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భార్గవ్ దేశ్ పాండే 17ఏళ్ల వయసులోనే రాష్ట్ర స్థాయిలో యుత్ కాంగ్రెస్ నేతగా క్రియాశీలకంగా ఎదిగి.. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆపై 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుండి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు..మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్పాండే మాట్లాడుతూ.. ‘టీడీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలాలు ఉన్న నేతల చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. 2006 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను.. ఇప్పుడున్న కాంగ్రెస్, ఆరోజు ఉన్న పార్టీ కాదు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పూర్తిగా రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో చెప్పే మాటలకు తెలంగాణలో పూర్తి విరుద్ధంగా పాలన నడుస్తుంది. రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఎందుకు టీడీపీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు ?. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చుట్టున్న నాలుగైదుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. టీడీపీ, RSS కాంగ్రెస్. అందుకే చెబుతున్నాను. లీవ్ కాంగ్రెస్. సేవ్ తెలంగాణ’ అన్నారు. .భార్గవ్ దేశ్ పాండే గత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ను.. పార్టీకోసం పనిచేసే వారికే ఇవ్వాలని ధిక్కార స్వరం వినిపించారు. దీంతో ఆయనపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. అప్పటి నుంచి ఆయన కొంతదూరం ఉన్నారు. ఆయనకు పార్టీ అధినాయకత్వం ఎలాంటి ఆదరణ కల్పించలేకపోయిందని నిరాశకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ప్రస్తుత ప్రజా పాలన సైతం బాగులేదంటూ విరుచుకుపడ్డారు..ఇక తన అనుచరులు, మద్దతుదారులు బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఓత్తిడి తెవడంతో గత రెండు రోజుల క్రితం abp దేశంతో ఆయన ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన ఇటివల ఆదిలాబాద్ కు చెందిన మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ను కలిశారు. కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఆదివారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు..