తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.

శిలాతోరణం వరకు ఉన్న భక్తుల క్యూలైన్‌
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,768 మంది భక్తులు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.57 కోట్లు..

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. గత కొన్ని రోజులుగా కొనసాగిన రద్దీకి భిన్నంగా, ప్రస్తుతం కొండపై ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

గురువారం ఉదయం నాటికి భక్తులు కేవలం 12 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సాధారణంగా వారాంతాల్లో, పర్వదినాల్లో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయి, వెలుపల కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తాయి. అయితే, ప్రస్తుతం రద్దీ తక్కువగా ఉండటంతో భక్తులకు నిరీక్షణ సమయం బాగా తగ్గింది. టైమ్‌స్లాట్ (SSD) టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు..

• ఒక్కరోజే సుమారు 73,226 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 24,754 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.66 కోట్లుగా నమోదైంది.