యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్..!

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ప్రజలు!..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ వద్ద జాతీయ రహదారి 65పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దసరా పండుగ సెలవులు నేటితో ముగియడంతో.. సొంత గ్రామాలకు వెళ్లిన పట్టణవాసులు తిరిగి హైదరాబాద్‌ బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది..

దసరా సెలవులు ముగుస్తుండటంతో సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న వాహనదారులతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చౌటుప్పల్ సమీపంలో కొనసాగుతున్న వంతెన పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సూచన…
మరోవైపు.. చౌటుప్పల్‌ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. దీంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. చౌటుప్పల్‌ పట్టణాన్ని దాటేందుకు వాహనదారులకు సుమారు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.