సమస్యలు పరిష్కరించకపోవడం దారుణం : కిషన్ రెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ (BJP) పూర్తి మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని సీతాఫల్ మండీ (Kishan Reddy) లో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. పిల్లలకు కావాల్సిన కనీస సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ (RTC) కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ అంశంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం విషయంలో ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అన్ని విధాల సహకరిస్తున్నప్పటికీ, వారి సమస్యలు పరిష్కరించకపోవడం దారుణం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీతో పాటు వారి డిమాండ్లను పరిష్కరించాలి అని తెలిపారు…
‘ఆర్టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఈ అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం విషయంలో ప్రభుత్వానికి ఆర్టిసి కార్మికులు అన్ని విధాల సహకరిస్తున్నప్పటికీ.. వారి సమస్యలు పరిష్కరించకపోవడం దారుణం. ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆర్టిసి కార్మికులకు పిఆర్‌సితో పాటు వారి డిమాండ్లను పరిష్కరించాలి’’ అని కిషన్ రెడ్డి అన్నారు.