మోడల్ స్కూల్ హాస్టల్‌ను తక్షణమే ప్రారంభించాలి
— విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో నేటికీ తెరుచుకోని మోడల్ స్కూల్ హాస్టల్
-విద్య సంవత్సరం ప్రారంభం అయి నేటికి మూడు నెలలు గడుస్తున్న తెరుచుకొని మోడల్ స్కూల్ హాస్టల్
— రెండు రోజుల్లో హాస్టల్ ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం
-బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ
పీ ఏ పల్లి ………..
పీ ఏ పల్లి మోడల్ స్కూల్ హాస్టల్‌ను తక్షణమే ప్రారంభించాలని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు.
మంగళవారం పీఏ పల్లిలో ఆయన మాట్లాడుతూ…..హాస్టల్ ప్రారంభం కాకపోవడంతో మోడల్ స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేటికీ హాస్టల్ తెరుచుకోకపోవడం బాధాకరమన్నారు.
హాస్టల్ సౌకర్యం లేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌ను ప్రారంభించే చర్యలు చేపట్టాలని బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.రెండు రోజుల్లోగా పీఏ పల్లి మోడల్ స్కూల్ హాస్టల్‌ను ప్రారంభించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే హాస్టల్‌ను ప్రారంభించాలని ఆయన కోరారు.