బోరబండ ముస్లిం స్మశాన వాటికకు 1 ఎకరం భూమి కేటాయింపు ఉత్తర్వులు.
హైదరాబాద్: బోరబండ ప్రాంతంలోని పిలి దర్గా సమీపంలో ఉన్న భూమి నుంచి ముస్లిం స్మశాన వాటికకు సంబంధించిన 1 ఎకరం భూమిని బోరబండ స్మశాన వాటికకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను బోరబండ స్మశాన వాటిక కమిటీ ప్రతినిధులకు TMREIS సభ్యుడు ఫహీమ్ ఖురేషి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అధికారికంగా అందజేశారు.
దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్మశాన వాటిక సమస్యకు పరిష్కారం చూపినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ముస్లిం సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన ఫహీమ్ ఖురేషి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్లను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959