ఇరాన్, అమెరికా మధ్య వార్ వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని శనివారం ఆయన మరోసారి ప్రకటించారు…ఈ ప్రాంతంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హౌతీ తిరుగుబాటుదారులు అమెరికాతో పోరాడటానికి సిద్ధంగా లేరని, అయితే సౌదీ అరేబియా పైప్లైన్పై జరిగిన డ్రోన్ దాడికి ఇరానే కారణం కావచ్చని ఆయన పేర్కొన్నట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం తెలిపింది. నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఈ యుద్ధం వెంటనే ముగుస్తుందని గతంలో ట్రంప్ తెలిపారు.
ఇరాన్ ఈ పోరాటాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదని స్పష్టం చేశారు. అయితే ఎలాంటి అధికారిక కాల్పుల విరమణ ఒప్పందం లేదా స్పష్టమైన కాలపరిమితి ప్రకటించకుండానే ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేస్తుండటం అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.