హెచ్ఎమ్టీవీ వార్తపై బీఆర్ఎస్ శ్రేణుల మండిపాటు..
పేయిడ్ న్యూస్లతో అసత్య ప్రచారం చేస్తే సాహించేదిలేదు కబాడ్ధార్..
బి ఆర్ ఎస్ యువజన నాయకుడు ముదిగొండ హరిదాస్
దేవరకొండ …………
మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ పై
హెచ్ ఎమ్ టీవీ ఛానెల్లో ప్రసారమైన వార్త ముమ్మాటికీ పేయిడ్ న్యూస్ అని బీఆర్ఎస్ దేవరకొండ యువజన నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో యువజన నాయకుడు ముదిగొండ హరిదాస్ మాట్లాడుతూ..
గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించి, సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైన వడ్త్యా రమేష్ అనే వ్యక్తి ఇప్పుడు పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ కోవర్టులుగా వ్యవహరిస్తూ పార్టీలో గందరగోళం సృష్టించడం, కార్యకర్తలను తప్పుదోవ పట్టించడమే ఇలాంటి పేయిడ్ వార్తల వెనుక ఉన్న అసలు కుట్ర అని ఆరోపించారు…
పార్టీకి నష్టం చేకూర్చే ఇటువంటి వ్యక్తులపై అధిష్ఠానం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
వాస్తవాలను పరిశీలించకుండా అసత్య ప్రచారాలకు వేదిక కల్పించడం సరైన జర్నలిజం కాదని
హెచ్ ఎమ్ టీవీ యాజమాన్యానికి హితవు పలికారు. ప్రసార మాధ్యమాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఒక పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే కథనాలను ప్రోత్సహించడం సమంజసం కాదని స్పష్టం చేశారు..
ఇలాంటి దుష్ప్రచారాలను వెంటనే నిలిపివేసి, పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి. లేకపోతే బీఆర్ఎస్ శ్రేణుల తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు..
రామావత్ రవీంద్ర కుమార్ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే సౌమ్య స్వభావం గల నాయకుడని, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా వెంటనే స్పందించే వ్యక్తి అని మరోసారి గుర్తు చేశారు. అలాంటి నాయకుడిని కించపరిచేలా పేయిడ్ న్యూస్లు రాపిస్తే బాగుండదని హెచ్చరిక జారీ చేశారు..