ప్రధాని మోడీ Pradhan Modi home. నివాసం దగ్గర రాహుల్ ధర్నా.
హాజరైన ప్రియాంక, కాంగ్రెస్ ఎంపీలు. Congress MP.. ప్రధాని రాజీనామా చేయాలంటూ నినాదాలు.
గూండాగిరి, నిరంకుశత్వం నడవదంటూ నినాదాలు. నీట్ లీకేజీ, neet paper leak ఢిల్లీలో పోలీసుల Delhi police లాఠీఛార్జ్, అణిచివేత చర్యలకు నిరసనగా ధర్నా.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఇటీవల చోటుచేసుకున్న విద్యార్థుల నిరసనలు, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, తీవ్ర అవకతవకలకు నిరసనగా కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్ర నేతలు తీవ్ర స్థాయిలో నిరసనకు దిగారు. ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధికారిక నివాసం వైపు కాంగ్రెస్ నేతలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అయితే, ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు ప్రధాని నివాసం ఎదుటే రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మోదీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని నివాస ప్రాంతం అంతా.. ‘తానాషాహీ నహీ చలేగీ’, ‘మోదీ ఇస్తీఫా దో’ అనే నినాదాలతో హోరెత్తుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని, పరీక్షల నిర్వహణలో వరుసగా జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు..