గోసుల రాములు మృతి బాధాకరం -దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్..!

చందంపేట……..
చందంపేట మాజీ సర్పంచ్ గోసుల రాములు మృతి బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం చందంపేట గ్రామంలో గోసుల రాములు మృతదేహానికి రమావత్ రవీంద్ర కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.రాములు మృతి కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని రమావత్ రవీంద్ర కుమార్ ఆకాంక్షించారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, నేనావత్ కిషన్ నాయక్, జార్పుల లోక్య నాయక్, రమావత్ మోహన్ కృష్ణ, ఉప సర్పంచ్ జబ్బు శ్రీశైలం, గోసుల శివ,చెన్నకేశవులు గౌడ్, హరిలాల్, వడత్య బాలు తదితరులు పాల్గొన్నారు.