నేను కొడితే మాములుగా ఉండదు…కాస్కో రేవంత్ రెడ్డి… కేసిఆర్..

LIVE :నేను కొడితే మామూలుగా ఉండదు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్‌

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ(శుక్రవారం) జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో గులాబీ బాస్ సమావేశం అయ్యారు..”నేను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. నేను కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం నాకు ఉన్న అలవాటు. రాబోయే ఫిబ్రవరి నెల చివరిలో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఎక్కడి ప్రాజెక్ట్‌లు అక్కడే పడుకున్నాయి. సంగమేశ్వరం , బసవేశ్వరాం, కాళేశ్వరం అన్ని ఎండబెడుతున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్‌ల టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపింది. నేను హరీష్‌రావుకు చెబుతున్నా సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్‌లపై పెద్దఎత్తున దండయాత్ర చేయాలి. ఆ ప్రాజెక్ట్‌లకు నీళ్లు రావాలి. ఆలోచన లేకుండా ఎవడో ఏమో చెబితే నమ్మి ప్రజలు ఓటేస్తే తెలంగాణకు మంచి గుణపాఠం జరిగింది. కైలాస ఆటలో పైకి పోయాక పెద్ద పాము మింగినట్లుగా తెలంగాణ అయ్యింది. కరోనాలో కూడా నేను రైతుబంధు ఇచ్చి రైతులకోసం మంచి పథకాలు తెస్తే అంత గంగలో కలిసిపోయింది. గురుకుల హాస్టళ్లలో తిండి సరిగా లేక పిల్లలు అస్వస్థతకు గురవ్వడం నాకు బాధకలిగిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల కోసం పుట్టింది కాదు” అని రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

తెలంగాణలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని అన్నారు. కైలాసం ఆడుతుంటే పెద్దపాము మింగినట్లుగా రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైందని తెలిపారు. మళ్లీ కరెంట్ కోతలు, మంచినీళ్ల కరువు కనిపిస్తోందని అన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే కేసులతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటోందని ఆరోపించారు. ఇక లాభం లేదు.. ప్రత్యక్ష పోరాటం చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. నమ్మి ఓట్లు వేస్తే మంచి గుణపాఠం చెప్పారని తెలిపారు. ..

సంగమేశ్వర(Sangameshwara), బసవేశ్వర(Basaveshwara) ఎత్తపోతల పథకం గురించి హరీష్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ వేధిస్తోంది.. గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలు సంగతి పక్కనబెడితే.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా గంగలో కలిశారని విమర్శించారు. కరోనా సమయంలో కూడా తాము రైతుబంధు, దళితబంధు, పింఛన్లు ఇలా ఏవీ ఆపలేదని గుర్తుచేశారు. ‘కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా.. నేను కొడితే మాములుగా ఉండదు’ అని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు..