రాష్ట్రపతిపై సోనియా గాంధీ వ్యాఖ్యలు…!. బీజేపీ మండిపాటు..!

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) స్పందించారు…ప్రసంగం అనంతరం సోనియా గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోయారని వ్యాఖ్యానించారు. సోనియా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయాయి. దీంతో బీజీపీ సోనియాగాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వంటి నేతలు ఇలా మాట్లాడకూడదని బీజపీ ఎంపీ సుకంతా మజుందార్ మండిపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రపతిని ఉద్దేశించే అలా మాట్లాడకూడదంటూ హితువు పలికారు. ఆదివాసి కుటుంబం నుంచి వచ్చి ద్రౌపతి ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ జమిందారీ మైండ్సెట్ ఈ విషయాన్ని అంగీకరించడంలేదంటూ విమర్శించారు. అందుకే ముర్ము ప్రసంగాన్ని వాళ్లు వ్యతిరేకిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలాఉండగా.. రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో కేంద్రం పాటిస్తున్న విధానాలు, సాధించిన విజయాల గురించి మాట్లాడారు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే 3 రేట్లు వేగంగా పనిచేస్తోందన్నారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా మారనుందని తెలిపారు. ప్రసంగం ప్రారంభించినప్పుడు రాష్ట్రపతి.. కుంభమేళా తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు..మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే మూడు రెట్లు వేగంతో పనిచేస్తోందని, త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారనుందని తెలిపారు. ప్రసంగం ఆరంభంలో ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. (Parliament Budget Session)..