దివంగత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూతుళ్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదం..!

దివంగత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూతుళ్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. మాగంటి కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు ఓఆర్‌ఆర్‌పై గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వైపు వెళ్తుండగా డీసీఎం వాహనాన్నిఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాగంటి పెద్ద కూతురు అక్షరకు తీవ్రగాయాలు కాగా.. చిన్నకూతురుతోపాటు మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు…నార్సింగ్ పోలీస్‌ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద కూతురు అక్షర చికిత్స అనంతరం కోలుకుంటుందని, చిన్న కూతురు స్వల్ప గాయాలపాలైందని కుటుంబసభ్యులు తెలిపారు. తమ స్నేహితులను ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది…నార్సింగ్లోని పోలీస్ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.