హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని చరిత్ర మరియు రాజ నీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులకు క్షేత్ర పర్యటన (Field Trip) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చారిత్రక ప్రాశస్త్యం కలిగిన బూరుగడ్డ శ్రీ ఆదివరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మరియు గోపాలపురం గ్రామ పంచాయతీని సందర్శించారు.
బూరుగడ్డ ఆలయ సందర్శన:
క్రీ.శ. 1172లో ప్రతాపరుద్రుని కాలంలో నిర్మితమైన ఈ పురాతన ఆలయ విశేషాలను విద్యార్థులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆలయ గర్భాలయంలో 2000 సంవత్సరాల క్రితం నాటి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఏకశిలా విగ్రహం (24 అడుగులు) ఉండటం, అలాగే ఆలయంలో 870 ఏళ్ళ నాటి శిలాశాసనాలు ఉండటం విశేషమని చరిత్ర అధ్యాపకులు శ్రీనివాస్ వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆలయ శిల్పకళను, శాసనాలను పరిశీలించారు.
గోపాలపురం గ్రామ పంచాయసందర్శన:
రాజ నీతి శాస్త్ర విభాగం అధ్యాపకురాలు సునందఆధ్వర్యంలో విద్యార్థులు గోపాలపురం గ్రామ పంచాయతీని సందర్శించి, స్థానిక పరిపాలనపై అవగాహన పెంచుకున్నారు. గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీను, ఉప సర్పంచ్, వీరేశ్వరరావు,వార్డు సభ్యులు చికూరి నారాయణ, కస్రం శ్రీను మరియు గ్రామ కార్యదర్శి ఇందిర లను విద్యార్థులు ముఖాముఖి నిర్వహించారు. రెండు సంవత్సరాల నుండి పంచాయతీకి నిధుల రాక, సి.సి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు తాగునీటి సమస్యలు పెరిగాయని, సమస్యల పరిష్కారానికి ఇప్పటికే రెండు లక్షలు సొంతగా ఖర్చు చేశానని సర్పంచ్ విద్యార్థులకు వివరించారు. ‘లెర్నింగ్ బై డూయింగ్’ (Learning by Doing) విధానంలో భాగంగా విద్యార్థులు క్షేత్రస్థాయిలో సమస్యలను, పరిపాలన తీరును స్వయంగా తెలుసుకున్నారు..
ఈ కార్యక్రమంలో చరిత్ర మరియు రాజకీయ శాస్త్ర విభాగాల అధ్యాపకులు, మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.