సూర్యాపేట జిల్లా… కోదాడ నియోజకవర్గం
నడిగూడెం మండలంలో L34 & L35 లిఫ్ట్‌ల ద్వారా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ, జల వనరుల శాఖ కార్యాలయం ముందు రైతులు ,కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది. రైతులకు వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లోని ప్రతి పట్టభద్రుడిని ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేయించి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు..
, వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ విఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి సంబంధిత అధికారులకు వినతి పత్రం అనంతరం కోదాడ పట్టణంలోని పెరిక భవన్లో ఓ శుభకార్యానికి హాజరైన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటుతో సమాధానం చెప్పాలని,పట్టభద్రులంతా ఐక్యంగా నిలిచి బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని కోరారు.మరోవైపు,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని నాయకులను సూచించారు.నవంబర్ 6వ తేదీ ఓటరు నమోదు చివరి గడువు కావడంతో,అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ గడువులోగా దరఖాస్తు చేసుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పట్టభద్రులు ఓటరు నమోదుపై నిర్లక్ష్యం చేయకుండా, ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.