జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా డిల్లీ హైకోర్టును Delhi High Court ఆశ్రయించారు. ఈ అంశంపై నేడు విచారణ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనకు పోలీసు అనుమతుల వెనకున్న ఉద్దేశం నిరసనకారులను అడ్డుకోవడం మాత్రమే కాదని జస్టిస్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. నిరసనల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకూడదన్న లక్ష్యం కూడా ఉందని పేర్కొంది. అక్టోబర్ 13న జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా ప్రయత్నించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా సోమవారం వరకూ తమకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని బుధవారం వరకూ మళ్లీ పొడిగించడాన్ని దాస్, రాంకా కోర్టులో సవాలు చేశారు…సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోశ్ రాంకాలను అక్టోబర్ 13న పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టే క్రమంలో వారు పోలీసుల బారికేడ్లను దాటి అక్కడికి ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేసినట్లు పేర్కొన్నారు. జంతర్‌మంతర్‌ను నిరసన ప్రదేశంగా గుర్తించిన అనుమతులను రద్దు చేసిన తర్వాత అక్కడికి వెళ్లడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ న్యాయ కస్టడీని పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీజేపీ నేతలు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారి కస్టడీ గడువు బుధవారంతో ముగియున్న నేపథ్యంలో పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. అయితే ప్రత్యామ్నాయ న్యాయ మార్గాలను అనుసరించకుండా నేరుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ధర్మాసనం ప్రశ్నించింది. సంబంధిత ఎస్ఈఎం విచారణ కోసం వేచి చూడాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించింది. దీంతో పిటిషనర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు..
ఫ్రాన్స్ అల్లర్లతో పోలిక ఎందుకు?.
విద్యార్థుల ఆందోళనలుగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీసిన ఉదంతాలు దేశ సరిహద్దులకు పరిమితం కాలేదని హైకోర్టు పేర్కొంది. ఫ్రాన్స్‌లో విద్యార్థుల నేతృత్వంలో మొదలైన నిరసనలు చివరకు నిప్పంటించే ఘటనలు, దోపిడీలకు దారితీసిన పరిణామాలను ఉదాహరణగా ప్రస్తావించింది. నిరసన ప్రారంభమైనప్పుడు దాని ఉద్దేశం ఒకటిగా ఉన్నా, ఆ తర్వాత పరిస్థితులు మారే అవకాశం ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు నిరసన నిర్వాహకులు ఎవరు? వారి అనుబంధ సంస్థ ఏమిటి? ఆ సంఘం లక్ష్యాలేంటి? అనే అంశాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయని పేర్కొంది. అయితే, నిషేధం లేదా అనుమతి రద్దు చేసిన ప్రదేశంలో నిరసన చేపట్టడం ఎంతవరకు తీవ్రమైన చర్యగా పరిగణించాలనే అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. బారికేడ్లు దాటి వెళ్లిన వ్యవహారంపై చట్టపరమైన అంశాలను ప్రత్యేకంగా పరిశీలిస్తామని తెలిపింది. నిరసన నిర్వహించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆ చర్యల చట్టబద్ధతను పరిశీలించడం వేరే అంశమని ధర్మాసనం పేర్కొంది..