ఖమ్మం–నల్గొండ–వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి కచ్చితంగా విజయం అవకాశాలు..చాణక్య స్ట్రాటజీస్.
ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం: చాణక్య స్ట్రాటజీస్.
ఖమ్మం–నల్గొండ–వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి కచ్చితంగా విజయం సాధిస్తారని చాణక్య స్ట్రాటజీస్ సర్వే అంచనా వేసింది.
చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించిన సర్వే వివరాల ప్రకారం వరంగల్లోని 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంది.
అదేవిధంగా ఖమ్మంలోని 10 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్లియర్ లీడ్లో ఉందని సర్వే తెలిపింది. ఇక నల్గొండ జిల్లాలో సగం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది.
ఈ లెక్కల ఆధారంగా ఖమ్మం–నల్గొండ–వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది.