భారతీయ తొలి బుల్లెట్ రైలు.. 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసినా, కుదుపు లేకుండా పట్టాలు మారనుంది. ఇందుకోసం సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు..ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) నుంచి అహ్మదాబాద్లోని సబర్మతి వరకు ఉన్న ఉన్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ డిసెంబర్ 2029 నాటికి పూర్తి కానుంది.
గంటకు 320 కి.మీ స్పీడ్
ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ రైలు రెడీ అవుతోంది. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ ఇండియన్ రైల్వే నెట్వర్క్ సరికొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 508 కిలోమీటర్ల ఈ కారిడార్ను నిర్మిస్తున్న నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL), ట్రాక్ వాలును కాపాడుతూనే రైళ్లు సున్నితంగా పట్టాలు మార్చడానికి వీలుగా కాంటెడ్ టర్న్ అవుట్ లను ఉపయోగిస్తోంది. రైలు ఎక్కువ వేగంతో పట్టాలు మార్చేటప్పుడు ఏర్పడే కంపనాలు, అసౌకర్యాన్ని తగ్గించడానికి ఈ సాంకేతికత రూపొందించబడింది.