దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాలు..!

తెలంగాణ, రాజస్థాన్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.

జమ్మూకశ్మీర్ నగ్రోటలో BJP అభ్యర్థి దేవయాని గెలుపు.

బడ్గాంలో పీడీపీ అభ్యర్ధి సయ్యద్ ముంతజీర్ విజయం.

జార్ఖండ్‌ ఘట్సిలలో JMM అభ్యర్థి సోమేశ్ చంద్ర విజయం.

రాజస్థాన్ అంటలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ విజయం.

పంజాబ్‌ తరణ్‌లో ఆప్ అభ్యర్థి హర్మిత్ గెలుపు.

మిజోరాం డంప ఉప ఎన్నికల్లో MNF అభ్యర్థి లాల్ గెలుపు.

ఒడిశా నౌపడలో బీజేపీ అభ్యర్థి జై దొలాకియా విజయం.

దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటాలో బీజేపీ జయభేరి మోగించగా బడ్గాంలో పీడీపీ గెలుపొందింది. రాజస్థాన్‌లోని ఆంటా స్థానాన్ని కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. ఒడిశాలోని నువాపడా నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకునే దిశగా సాగుతోంది. మిజోరంలోని డంపాలో ఎంఎన్ఎఫ్ గెలుపొందింది. పంజాబ్‌లోని తరణ్‌తరణ్‌ను ఆప్‌ నిలబెట్టుకుంది. ఝార్ఖండ్‌లోని ఘట్‌సిలాలో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా ఆధిక్యంలో సాగుతోంది..
రాజస్థాన్‌లోని ఆంటా ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రమోద్ జైన్ 15,600కిపైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి మోర్పాల్ సుమన్‌పై గెలుపొందారు. గత ఎన్నికల్లో ప్రమోద్‌ జైన్‌ బీజేపీ అభ్యర్థి కన్వర్‌లాల్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఐతే ఒక క్రిమినల్‌ కేసులో కన్వర్‌లాల్‌ దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటు పడి ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.

జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. మహిళా వ్యాపారవేత్త, బీజేపీ అభ్యర్థి దేవ్‌యానీ రాణా 24,647 ఓట్ల ఆధిక్యంతో జమ్మూ-కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్ష్ దేవ్ సింగ్‌పై గెలుపొందారు. ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. దేవేందర్‌ సింగ్‌ రాణా కుమార్తే దేవ్‌యానీ రాణా. గత ఏడాది తన తండ్రి మరణంతో రాజకీయాల్లో ఆమె క్రియాశీలకంగా మారారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ఆమెకు బంధువు కావడం గమనార్హం.

మరోవైపు బడ్గాం నియోజకవర్గంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) గెలుపొందింది. పీడీపీ అభ్యర్థి అగా సయ్యద్ ముంతాజిర్ మెహదీ 4,478 ఓట్ల మెజార్టీతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన అగా సయ్యద్ మహమూద్ అల్-మోసావిపై గెలుపొందారు. జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బడ్గాం స్థానాన్ని ఖాళీ చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు..