లారీని ఢీకొన్న కారు ఇద్దరు మృతి…!

భువనగిరి బైపాస్ వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొన్న కారు…

ప్రమాదంలో ఇద్దరు మృతి,మరో ఐదుగురికి తీవ్రగాయాలు…

మృతుల్లో ఓ మహిళ,చిన్నారి….

భువనగిరి..:వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది . వివరాలిలా వరంగల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని కారు వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ, చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంకు చెందిన వారిగా గుర్తించారు. పెట్రోల్ పంపు లోకి వెళ్తున్న లారీని వెనుక నుండి కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాద సంభవించిందని స్థానికులు తెలిపారు. కారు పూర్తిగా లారీకి వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జెసిబి సహాయంతో కారును బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.