కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి లకు కళ్ళు మూసుకుపోయాయా చెరువులు నింపకుండా జాప్యం చేస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
మీటింగుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పుకునే నాయకుల కళ్ళు మూసుకుపోయాయా చెరువులు నింపకుండా జాప్యం చేస్తున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి లేను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్గొండ జిల్లా
నకిరేకల్ పట్టణంలోని పెద్ద చెరువు వద్ద మీడియా సమావేశం నిర్వహించిన టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ సందర్భంగా ఆయన చెరువులోకి దిగి పరిశీలించారు నిత్యం నీటితో కలకల్లాడే చెరువు కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వలన ఎండిపోతుందని సాగర్ లో నీరు డెడ్ స్టోరేజీ ఉన్న సమయంలో కూడా కేసీఆర్ రైతు సంఘానికి ఎడమ కాలుల ద్వారా నీళ్లు అందించారని తెలిపారు.
సాగర్ లోకి నీళ్లు వస్తున్నా కూడా రోజు 30 టీఎంసీల నీళ్లు ఆంధ్రకు వెళుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టించుకోవట్లేదని ధ్వజం ఎత్తారు. రాష్ట్రంలో చెరువులను ఎండబెట్టి మట్టిని అమ్ముకోవడం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పరిపాటిగా మారిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
ఎలినో వలన కరువు వస్తుందని శాస్త్రవేత్తలు ముందుగానే సూచించిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రైతులను నట్టేట ముంచిందని అన్నారు మీరు ఎగువ నుండి నాగార్జునసాగర్ కి వస్తున్న రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంలో ఆంతర్యం ఉందని అది రైతులు తెలుసుకోవాలని లింగయ్య తెలిపారు మీరు వస్తే ఎరువులు యూరియా ఇవ్వాల్సి వస్తుంది పండిన పంట కొనాల్సి వస్తుంది. నీరే లేకుంటే రైతులు పంటలు పండించకుండా ఉంటారు అప్పుడు ప్రభుత్వం తప్పించుకోవచ్చు అనే సాకుతో నీరును చెరువులకు నింపకుండా పంటకు అందించకుండా జాప్యం చేస్తున్నారని లింగయ్య రైతులకు తెలిపారు.
స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం ఇంటి ముందే ఉన్న చెరువు ఎండిపోతుంటే చూస్తూ ఉన్నారని రోజు చెరువు కట్ట పైన వాకింగ్ చేస్తూ ఉంటారని కనీసం చెరువులను నింపే ఆలోచన కూడా చేయడం లేదని ఎమ్మెల్యే వేముల వీరేశంపై విమర్శలు చేశారు చిరుమర్తి లింగయ్య.
నిత్యం మీటింగుల్లో మేమే ముఖ్యమంత్రి కాండిడేట్లము అని చెప్పుకునే వ్యక్తులు మంత్రులుగా ఉన్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి లను టార్గెట్ చేస్తూ చిరుమర్తి లింగయ్య పలు వ్యాఖ్యలు చేశారు కాలేశ్వరం ద్వారా నీటిని అందించకుండా కాలేశ్వరాన్ని నింపకుండా దాన్ని గాలికి వదిలేసారని తెలిపారు. బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు కోసం కెసిఆర్ దగ్గర ఎంతగానో పోట్లాడి తెచ్చి ట్రైలర్ చేసిన తర్వాత తామేదో ప్రాజెక్టు కట్టినట్లుగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చి రిబ్బన్ కట్ చేసి వెళ్ళారని విమర్శించారు చిరుమర్తి లింగయ్య.