సిఐటియు అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి..సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి పిలుపు.
*గోడపత్రిక ఆవిష్కరణ*
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) అఖిలభారత 18వ మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు జరుగుతున్న సందర్భంగా మంగళవారం పరవాడ మండలం లంకెలపాలెం లో గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది. సిఐటియు ఏర్పడిన 55 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ మహాసభ జయప్రదానికై కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ మహాసభల్లో పలు తీర్మానాలు చేయడంతో పాటు భవిష్యత్తు పోరాటాలకు రూప కల్పన జరుగుతుందని అన్నారు. ఫార్మా, బ్రాండిక్స్ తదితర పారిశ్రామిక కార్మికుల ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పని గంటల పెంపు వంటి అంశాలపై ఎప్పటికే పలు పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. అసంఘటిత రంగకార్మికులు, స్కీం వర్కర్స్ సమస్యలపై సిఐటియు నిరంతరంగా పోరాడుతుందని గని శెట్టి అన్నారు. ఈ మహాసభలు జయప్రదానికై అందరూ తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఎం రమణి, సిహెచ్ పద్మ, ఎల్ సన్యాసిరావు, పైడ్రాజు, శివమ్మ, స్వాతి, నారాయణమ్మ, దివ్య తదితరులు పాల్గొన్నారు.