కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.
_• పలించిన విద్యార్థుల పోరాట ఫలితం,
లోకసభ ప్రతిపక్ష నేత అఖిలభారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, నెలరోజులుగా విద్యార్థుల పోరాటం సిజెపి, డిమాండ్ తో.. జంతర్ మంతర్ దగ్గర ఇటీవల జరిగిన నిరసనలతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ,. నీట్ పేపర్ లీక్ వ్యవహారం లో బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్………_
పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు.
దేశంలో దాదాపు 150 రకాల పరీక్షల నిర్వహణలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడటం, నీట్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో ఆయనపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.
రాజీనామా అనంతరం ప్రధాన్ స్పందిస్తూ.. “దేశంలోని యువత, విద్యార్థుల ఆకాంక్షలను, వారి భావోద్వేగాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాను” అని ప్రకటించారు.
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు చేపట్టిన సుదీర్ఘ నిరసనలకు ఈ రాజీనామాతో పెద్ద విజయం లభించినట్లయింది..