ఏపీ రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి
ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
రామోజీరావు జయంతిని ఏటా రాష్ట్ర పండుగగా సీఎం ప్రకటించారు.
నియంతలకు తలవంచని యోధుడని, తెలుగు జాతి కీర్తి అని కొనియాడారు.
అమరావతి పేరు సూచన, అనేక రంగాల్లో సేవలు అందించారు..
Ramoji Raos Birth Anniversary as State Festival |.
విజయవాడ: పద్మవిభూషణ్ రామోజీరావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్రానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు ఏపీ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. ఇకపై ఏటా రామోజీరావు జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో జరిగిన రామోజీ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు….జర్నలిజం, కళలు, సంస్కృతి, గ్రామీణాభివృద్ధి-వ్యవసాయం, మహిళా సాధికారిత, సైన్స్ & టెక్నాలజీ, యూత్ ఐకాన్, సామాజిక సేవ, విద్య, వైద్య రంగాల్లో అవార్డులు అందుకుంటున్న 9 మంది విశిష్ట వ్యక్తులకు ఆయన అభినందనలు తెలియజేశారు. కృష్ణా జిల్లాలో జన్మించిన రామోజీరావు గొప్ప సంస్థలను స్థాపించి, వాటిని ఎంతో సమర్థంగా నడిపించారని చంద్రబాబు కొనియాడారు. సంకల్పం, క్రమశిక్షణ, విలువలు, సమాజహితం, నాణ్యత, విశ్వసనీయత లాంటి విధానాలను పాటించారని తెలిపారు. జనం కోసం జర్నలిజాన్ని నమ్ముకుని, అక్షరమే ఆయుధంగా మలచుకుని పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావని, నిష్పక్షపాతంగా జర్నలిజం సహా వివిధ రంగాల్లో ఆయన సేవలందించారని గుర్తుచేశారు. మీడియా సంస్థలతో పాటు పాటు విలువలతో కూడిన సినిమాలు తీసి సమాజానికి అందించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ప్రతి రాత్రీ 9 గంటలకు వారి ఛానల్ న్యూస్ చూసి వార్తలు తెలుసుకునే పరిస్థితి నేడు ఉందని పేర్కొన్నారు… గతంలో మీడియా సంస్థ ఎప్పుడూ ముందుండి స్పందించిందని సీఎం చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి పేరును లోతుగా అధ్యయనం చేసి ‘అమరావతి’ అని సూచించింది ఆయనేనని తెలిపారు. రాజధాని నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళం, కరోనా సమయంలోనూ రాష్ట్రానికి రూ.10 కోట్ల విరాళం ఈనాడు గ్రూప్ ఇచ్చిందని అని గుర్తుచేశారు..