ఈ నెల 9న సీఎం రేవంత్ రైతు ఆశీర్వాద సభ.!.

_• గత నెల 30న వర్షం కారణంగా వాయిదా పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభను ఈ నెల 9వ తేదీన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరగనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి._

_• సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం పరిశీలించారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సభ విజయవంతంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు._

_• ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించిన అనంతరం ఈ నెల 9న రైతు ఆశీర్వాద సభ నిర్వహణపై అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపారు. సభకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్లు పేర్కొన్నారు.