ఈ సారి సిరిసిల్ల గడీల మీద గురి పెడతాం..ఈ గడీని నేలమట్టం చేస్తా బీఆర్ఎస్‎కు సవాల్ విసురుతున్న..సీఎం రేవంత్ రెడ్డి.

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తుల వివరాలపై ధైర్యముంటే తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తుల వివరాలపై ధైర్యముంటే తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్‎కు నా గురించి.. కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదని.. ఫామ్‎హౌస్‎లో పడుకున్న వాళ్ల అయ్య కేసీఆర్‎ను అడుగితే చెప్తాడన్నారు. ఆనాడు గజ్వేల్ గడీని నేలమట్టం చేస్తామని చెప్పినం.. చేసి చూపించాం.. ఈ సారి సిరిసిల్ల గడీల మీద గురి పెడతాం.. ఈ గడీని నేలమట్టం చేస్తామని బీఆర్ఎస్‎కు సవాల్ విసిరారు. బుధవారం (సెప్టెంబర్ 30) సీఎం రేవంత్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 2009లో కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్‎ను అమెరికా నుంచి దింపి సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారన్నారు. ఆ ఎన్నికల్లో కేటీఆర్ 172 ఓట్ల తేడాతో చావు తప్పి కన్ను లొట్టపోటయినట్లు గెలిచారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆ కుటుంబానికి లక్షల కోట్ల ఆస్తులెలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వారు అన్ని ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ మొత్తాన్ని దోచుకుందని ఫైరయ్యారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. ‘గల్ఫ్‌లో తెలంగాణ కార్మికులు మరణిస్తే.. కనీసం మృతదేహాలను తెచ్చేందుకు కూడా బీఆర్ఎస్ సహకరించలేదు. గల్ఫ్ బాధితుల కష్టాలు వారికి పట్టవు’ అని రేవంత్ పేర్కొన్నారు. అసలు గల్ఫ్ వలసలను కేసీఆర్ ఎందుకు ఆపలేకపోయారని ఆయన నిలదీశారు.

సిరిసిల్లపై గురి

ఈ సందర్భంగా సిరిసిల్లలో కేటీఆర్ గడీలను నేలమట్టం చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన చెప్పారు. అలాగే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు పదవులు వచ్చాయని, తమ పాలనలో తెలంగాణ కోసం కొట్లాడినవారికి పదవులు ఇచ్చామని తెలిపారు.

2009 నుంచి ఆరుసార్లు జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు కేటీఆర్‎ను గెలిపించారు. కానీ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కేటీఆర్ నేతన్నల ఆత్మహత్యలను ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. గల్ఫ్‎కు వలసపోతున్న కార్మికులను ఎందుకు ఆపలేకపోయారని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నల కుటుంబాలను ఆదుకోవడానికి అణాపైసా సాయం చేయలేదన్నారు.