ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి…

ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి..

* రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ల అరెస్టును ఖండించిన ముఖ్య‌మంత్రి

* ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు అహింసాయుతంగా ఉద్య‌మిస్తున్ననాయ‌కుల‌ను బ‌లవంతంగా అరెస్టు చేయ‌డం ప్ర‌జాస్వామ్య విరుద్ధ‌మ‌ని పేర్కొన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

* అరెస్టులు, జైళ్లు, లాఠీఛార్జీలు గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ నేత‌ల‌కు కొత్త కాద‌న్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

* అరెస్టులు చేసి, జైళ్ల‌లో పెట్టినంత మాత్రాన ఎన్నిక‌ల క‌మిష‌న్ త‌ప్పుల‌పై కాంగ్రెస్ పోరాటం ఆప‌ద‌ని స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
స‌ర్ త‌ప్పిదాల‌కు సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వ‌ర‌కు కాంగ్రెస్ విశ్ర‌మించ‌ద‌న్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..

• సీఎం రేవంత్ రెడ్డి స్పందన: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అహింసాయుతంగా ఉద్యమిస్తున్న విపక్ష నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అణచివేత చర్యలతో SIR పై తమ పోరాటం ఆగేది లేదని ఆయన స్పష్టం చేశారు..

మరోవైపు, దిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగుతుండగా, తెలంగాణలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ అరెస్టును ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు