ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గచ్చిబౌలి స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, హైదరాబాద్‌ను క్రీడా హబ్‌గా మార్చాలని నిర్ణయించారు.

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ స్టేడియం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హెలిప్యాడ్, అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు.

ఇదే సమయంలో క్రీడలు.. సామాజిక సేవల్లో ఉన్న వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. తాజాగా వీరితో నిర్వహించిన సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ గచ్చిబౌలి స్టేడియం కోసం కొత్త ప్రతిపాదనలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ రూపకల్పనలో భాగంగా పలువురి ప్రముఖుల సహకారం తో పాటుగా బాధ్యతలు కేటాయించారు. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసనకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. స్పోర్ట్స్ హబ్ కోచైర్మన్‌గా ఆమెను నియమించింది. ఇక.. హైదరాబాద్‌ను దేశపు క్రీడా రాజధానిగా మార్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో భారీ అడుగు వేశారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ‘తెలంగాణ స్పోర్ట్స్ హబ్’గా తీర్చిదిద్దేందుకు సంబంధించి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా సంజీవ్ గోయెంకా, ఉపాసన కొణిదెల, కావ్య మారన్ వంటి ప్రముఖులు ఈ బోర్డులో సభ్యులుగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

*ఉపాసన, కావ్యకు స్టేడియం అభివృద్ధిపై సీఎం పూర్తి స్వేచ్ఛ*

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులతో సమీక్షలో భాగంగా తన లక్ష్యాల ను వివరించారు. గచ్చీబౌలి స్టేడియం రూపురేఖలను మార్చేలా పలు సూచనలు చేశారు. స్పోర్ట్స్ హబ్ చైర్మన్‌గా సంజీవ్ గోయెంకా, కో-చైర్మన్‌గా ఉపాసన కొణిదెల, సభ్యురాలిగా కావ్య మారన్ కి స్టేడియం అభివృద్ధిపై సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చైనాలోని క్రీడా సౌకర్యాలను మించేలా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ నిర్వహించే స్థాయికి హైదరాబాద్ ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. క్రీడాకారులు విమానాశ్రయం నుండి నేరుగా స్టేడియానికి చేరుకునేలా ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గచ్చిబౌలిలోని లక్షలాది మంది ఐటీ ఉద్యోగులను ఆకర్షించేలా స్టేడియంలో భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సూచించారు….