విద్యా విధానానికి సంబంధించి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.!.

సచివాలయంలో తెలంగాణ విద్యా విధానం రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. సమావేశంలో విద్యా విధానానికి సంబంధించి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని సీఎం అన్నారు. భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో ఉండాలని చెప్పారు. విజన్ డాక్యుమెంట్ 2047లో ప్రత్యేక అధ్యాయం, విద్యా రంగం సమూల ప్రక్షాళనే తమ ధ్యేయం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు…పేదరిక నిర్మూలనకు విద్యే ఏకైక ఆయుధం

సిలబస్, వనరుల సమీకరణ, అమలుపై స్పష్టత అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదరిక నిర్మూలనకు విద్యే ఏకైక ఆయుధమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విశ్వాసం కల్పించాలని అధికారులకు సూచించారు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని.. యూనివర్సిటీ వీసీల నియామకాలు కూడా పూర్తయ్యాయని సీఎం పేర్కొన్నారు. విద్యార్థులు ఉద్యోగాలు లేక డ్రగ్స్ బారిన పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు..