పాదయాత్ర తప్పకుండా ఉంటుంది
కానీ.. ఇంకా మూడేళ్ల సమయం ఉంది కాబట్టి పాదయాత్రకు తొందరేం లేదు
స్లిమ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా.. త్వరలోనే జిమ్‌కి వెళ్లడం మొదలుపెడతా
సమయం వచ్చాక కేసీఆర్ జనాల్లోకి వస్తారు.. ఎప్పుడో రావాలో ఆయనకు తెలుసు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పుడు కేసీఆర్ విలువ ఏంటో తెలిసొచ్చింది
రేవంత్ సర్కార్‌కి ఏడాది టైం ఇచ్చాం.. పొద్దున లేస్తే కేసీఆర్ జపమే చేస్తున్నాడు
– చిట్‌చాట్‌లో కేటీఆర్..
కార్యకర్తలు అందరూ కోరుకుంటుండడంతో కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తానని ప్రకటించారు..
ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉంది
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉందని, తమ వాయిస్ వినిపించే హక్కు ఉందని కేటీఆర్ అన్నారు. కొత్త పార్టీలు పెట్టుకుని తమ విధానాలను ప్రజలకు చెప్పి, వారి దగ్గరకు వెళ్లవచ్చని, దాన్ని తాను స్వాగతిస్తానని చెప్పారు. అదేవిధంగా తాము బతుకమ్మ చీరలు కులం, మతం, అంతరం, భేదం లేకుండా అందరికీ ఇచ్చామని, అయితే ఈ ప్రభుత్వం కొందరికి మాత్రమే ఇస్తోందా అని ఆయన ప్రశ్నించారు..