CMO, మంత్రుల వాట్సాప్లు హ్యాక్.

CMO, మంత్రుల వాట్సాప్లు హ్యాక్

TG: తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. సీఎంఓ, పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్లను హ్యాక్ చేశారు. ఎస్బీఐ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర APK ఫైల్స్ పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో APK ఓపెన్ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే….ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ SBI పేరుతో సందేశాలు పంపిస్తున్నారు. మరో వైపు ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన వారికి సంబంధించిన వాట్సాప్ మీడియా గ్రూప్ లను సైబర్ నేరగాళ్లు లక్ష్యం చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా 8 రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ కు గురైన సంగతి తెలిసిందే. కోర్టు ఆర్డర్ కాపీలు డౌన్ లోడ్ చేస్తుండగా గేమింగ్ సైట్ లోకి డైరెక్షన్ చేశారు. దీంతో తెలంగాణ డీజీపీకి హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు…