భారీగా పొగ మంచు..!

సూర్యాపేట జిల్లా.. హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా లొ భారీగా పొగ మంచు…

తెల్లవారుజామున కళ్లముందు ఏమీ కనిపించనంత దట్టంగా పొగ మంచు అలుముకుంటోంది… ఉదయం నుండి ఏకదాటిగా మంచు కురుస్తూనే ఉంది.

గ్రామీణ ప్రాంతాలలో డట్టమైన పొగ మంచు కమ్మేసింది.

ఉదయం తొమ్మిదయినా మంచు తేరుకోలేదు.

జాతీయ రహదారిపై దట్టంగా కమ్ముకోవటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది…

వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు…..
పంటపొలాల్లో తీవ్రత ఎక్కువగా ఉండడంతో రైతులు పనులకు వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. అంతే కాకుండా చూపరులను ఆకట్టుకోగా మంచు ప్రభావం ఎక్కువున్న ప్రాంతాల్లో వాహనదారులు స్వీయచిత్రాలు తీసుకుని ప్రకృతిని ఆస్వాదించారు.

కొన్ని ప్రాంతాలలో మండలాల్లో దట్టమైన పొగమంచు చూపరులను కనివిందు చేసింది….

హిమాలయాల్లోని వాతావరణాన్ని తలపించింది…