ఏపీలోని కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షిణిస్తున్నాయి. అధికారం అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. తాజాగా పోలీస్ కానిస్టేబుల్‌పై టీడీపీ నాయకుడు దాడికి( Attacks police constable) పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..ర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం వెల్దుర్తి జెడ్పీ హైస్కూల్ మైదానంలో ఇంకుడు గుంత నిర్మాణంపై ఫిర్యాదు అందుకుని వచ్చిన పోలీసులపై టీడీపీ నాయకుడు (TDP leader) శ్రీనివాసులు గౌడ్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎస్ఐకి ఫోన్ చేసి.. తిరిగి మీ మీదనే కేసు పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా, నిన్న శ్రీకాళహస్తిలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన యువకులను రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు.. ఇప్పుడు టీడీపీ నాయకుడిపై కూడా అదే స్థాయిలో చర్యలు తీసుకుంటారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని వెల్దుర్తి జెడ్పీ హైస్కూల్ మైదానంలో ఇంకుడు గుంత నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులపై టీడీపీ నాయకుడు శ్రీనివాసుల గౌడ్ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పోలీసులపై దాడి అనంతరం ఎస్ఐకి ఫోన్ చేసి, తిరిగి పోలీసులపైనే కేసు పెడతానంటూ శ్రీనివాసుల గౌడ్ బెదిరించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై పోలీసు వర్గాల నుంచి తదుపరి చర్యలు ఏవన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదే సమయంలో శ్రీకాళహస్తిలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌తో ఘర్షణకు దిగిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి, ప్రధాన నిందితుడిని పట్టణ వీధుల గుండా కోర్టుకు తీసుకెళ్లిన ఘటన కూడా ఇటీవల చర్చనీయాంశమైంది.
దీంతో చట్టం ముందు అందరూ సమానమేనా? వెల్దుర్తి ఘటనలోనూ పోలీసులు అదే స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటారా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.