వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం తిరుపతిలో విమర్శించారు. “జగన్ గారూ.. మీకు రెడ్ల ఓట్లు నిజంగా కావాలనుకుంటే మళ్లీ హిందూ మతానికి తిరిగి రండి. అప్పుడే మీ పేరులోని జగన్ మోహన్ రెడ్డి అనే పేరుకు సార్థకత చేకూరుతుంది,” అని ఆయన చెప్పారు. “ఆయన(జగన్) తిరిగి హిందూ మతంలో చేరతానంటే సాదరంగా ఆహ్వానిస్తాం,” అని విజయసాయి రెడ్డి అన్నారు…
మళ్లీ మీడియా ముందుకు విజయసాయిరెడ్డి.
విజయసాయిరెడ్డి తన మార్క్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టారు. తొలుత విజయవాడ మీడియా సమావేశంలో రాజధానికి అనుకూలమన్నారు. విశాఖలో మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటలు ఆడారని, ఆ ప్రాంత ప్రజలకు వైసీపీకి క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు తిరుపతి వంతైంది. తిరుమల లడ్డూలో కల్తీ నిజమేనని, కాకపోతే జంతువుల కొవ్వులేదని అంటున్నారు. అది సంబద్దమైన ఆరోపణ అని, ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. విచారణలో అదే తేలిందన్నారు……..తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వివాదంపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి అక్టోబర్ 2026 ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆయన కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు….ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. అదే సమయంలో మరొక పాయింట్ రైజ్ చేశారు విజయసాయిరెడ్డి. హిందువులను విడదీసి రాజకీయాలు చేస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరారు. చంద్రబాబు కులాన్ని ఉపయోగించుకుంటే, జగన్ మతాన్ని ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. హిందువులకు చంద్రబాబు ద్రోహం చేస్తుంటే.. జగన్ తన పేరు చివర రెడ్డి తగిలించుకుని రెడ్డి సామాజిక వర్గాన్ని, క్రిస్టియన్, మైనార్టీ వర్గాలను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారని ఆరోపించారు..