బ్యాంకింగ్ రంగంలో సైబర్, ఆర్థికపరమైన మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి ఇది అందుబాటులోకి రానుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) భారతీయ బ్యాంకుల కోసం ప్రత్యేకమైన “.bank.in” డొమైన్ను ప్రవేశపెట్టింది. ఆన్లైన్ భద్రతను మెరుగుపరచడం, ఫిషింగ్ దాడులను తగ్గించడం, డిజిటల్ బ్యాంకింగ్, చెల్లింపు వ్యవస్థలను మరింత బలోపేతం చేయనుంది.
ఆర్థిక మోసాలను అరికట్టడానికి భారతీయ బ్యాంకుల కోసం ప్రత్యేక ‘.bank.in’ ఇంటర్నెట్ డొమైన్ను ప్రారంభించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల ప్రకటించారు. భారతీయ బ్యాంకుల కోసం రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్ Bank.inను అమలు చేయబోతోంది.
ఈ విధానం ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చట్టబద్ధమైన బ్యాంకింగ్ వెబ్సైట్లు, మోసపూరిత వెబ్సైట్ల మధ్య తేడాను గుర్తించడంలో కస్టమర్లకు సహాయపడటం ఈ విధానం లక్ష్యం.