కాంగ్రెస్‌కు విస్తరణ చిచ్చు.. మొత్తం 12మంది అసంతృప్తిలో ఆశావాహులు..!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. బీసీ సామాజిక వర్గం నుంచి వి. శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకట స్వామి, మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు కొత్తగా మంత్రివర్గంలోకి చేరనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.19 నిమిషాలకు రాజ్ భవన్ లో వీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే, మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశించి భంగపడిన నేతలు అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు…మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి దక్కుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుందర్శన్ రెడ్డితోపాటు ప్రేమ్ సాగర్ రావులు ఆశించారు. కాంగ్రెస్ వర్గాల్లోనూ ఆ మేరకు చివరి వరకు చర్చ జరిగింది. అయితే, చివరి నిమిషంలో కేవలం బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రమే కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించింది. దీంతో సుందర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ లు అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు…

మంత్రి పదవి దక్కకపోవడం పై తీవ్ర అసంతృప్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

రాహుల్ గాందీకి లేఖ రాస్తానంటున్న మల్ రెడ్డి రంగారెడ్డి

మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్న మల్ రెడ్డి రంగారెడ్డి

సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి..

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌లు తమకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. మొదట్నుంచి వచ్చిన ఊహాగానాల్లోనూ వీరి పేర్లే ప్రముఖంగా వినిపించాయి. కానీ చివరకు అనూహ్యంగా కాంగ్రెస్‌ అధిష్టానం వారికి మొండి చేయి చూపింది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో వారిని బుజ్జగించేందుకు హైకమాండ్‌ సిద్ధమైంది.

మంత్రివర్గంలో తనకు స్థానం లభించకపోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సుదర్శన్‌ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన నివాసానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎంపీ అనిల్‌ యాదవ్‌ వెళ్లారు. ఆయనతో సంప్రదింపులు జరిపారు. సుదర్శన్‌ రెడ్డితో చర్చల అనంతరం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావుతో మాట్లాడేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే వారిద్దరూ అందుబాటులో లేకుండాపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మల్‌రెడ్డి రంగారెడ్డి ఇవాళ సాయంత్రం ప్రెస్‌మీట్‌ పెట్టనున్నట్లు తెలిసింది. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది..

తమకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన వారిలో 1)ప్రేమ్ సాగర్ రావు, 2) రాజగోపాల్ రెడ్డి, 3)మల్ రెడ్డి రంగారెడ్డి, 4)రామ్మోహన్ రెడ్డి, 5) సుదర్శన్ రెడ్డి, 6) బాలు నాయక్, 7) విజయశాంతి, 8) అద్దంకి దయాకర్, 9) MLC అమీర్ అలీ ఖాన్, 10) ఆది శ్రీనివాస్,11) బీర్ల ఐలయ్య, 12) మదన్ మోహన్ రావు తదితరులున్నారు.కాగా అసంతృప్తులను బుజ్జగించేందుకు పీసీసీ నేతలు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు వెళ్లి ఆయనను బుజ్జగించారు.రాజీనామా చేస్తానంటూ అనుచరులతో సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు..