ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా సాగించే హమాస్ కార్యకలాపాలకు ఉపయోగించిన సొరంగం…!

ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్‌ రహస్య స్థావరాన్ని గుర్తించాయి. గాజా ఆస్పత్రి కింద హమాస్ టన్నెల్ నెట్‌వర్క్‌ను కొనుగొన్నట్లు పేర్కొన్నాయి..ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా సాగించే హమాస్ కార్యకలాపాలకు ఈ సొరంగం కమాండ్ సెంటర్‌గా ఉపయోగిస్తుంటారని ఇజ్రాయెట్‌ తెలిపింది. అలాగే ఆయుధాలు, నిఘా సామగ్రితో కూడిన భూగర్భ మౌలిక సదుపాయాలు కలిగివున్న సొరంగపు ఫుటేజీని విడుదల చేసింది.

గాజాలోని ఖాన్ యూనిస్‌లోని ఒక కీలక ఆస్పత్రి కింద ఈ సొరంగం ఉందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ కింద ఉన్న ఈ సొరంగం సీనియర్ హమాస్ నేతల కమాండ్ అండ్ కంట్రోల్‌కు కేంద్రంగా ఉంటూ, ఇజ్రాయెల్ దళాలపై దాడులను సమన్వయం చేయడానికి ఉపయోగపడింది..