సూర్యాపేట జిల్లా..
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సూర్యాపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరును ఎండగట్టిన మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
మాజీమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ…
కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవదని అర్థమైంది..
అందుకే అడ్డూఅదుపు లేనిపాలన సాగిస్తుంది..
ఎట్లున్న రాష్ట్రం ఎట్లాయితుందో చూస్తున్నారుకదా..
కెసిఆర్ పదేండ్ల పాలనలో ఎంతో అభివృద్ధి జరిగింది..
ఈ రెండేళ్ల కాంగ్రేస్ పాలనలో ఎంతో ఆగమైంది..
కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు దోచుకోవడం తప్ప అభివృద్ధి పట్టదు..
సాగునీరే కాదు.. తాగు నీరు కూడా సక్కగ ఇస్తలేరు..
ఇచ్చిన హామీల మాట దేవుడెరుగు.. కెసిఆర్ ఇచ్చినయే అందుతలేవంటున్నారు..
పెంచుతామన్నా పెన్షన్లు ఇంకా ఎన్నడు పెంచి ఇస్తారు..
ఆడబిడ్డల పెండ్లిళ్లకు కెసిఆర్ పెట్టిన లక్ష తో పాటు తులం బంగారం ఎప్పుడిస్తరు..
ఆడపిల్లలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎటుపోయినయ్..
ఇప్పుడు జరిగే ఎన్నికలల్ల ఏ మొఖం పెట్టుకుని ఓట్లడుగుతారు..
కాంగ్రేసొళ్ళు ఇండ్ల ముందుకు వచ్చినప్పుడు ప్రజలే నిలదీయాలి..
రెండేళ్లు ఓపికపట్టుకుంటే వచ్చేది మల్లా కెసిఆర్ ప్రభుత్వమే..
ఎవ్వరూ అధైర్య పడవద్దు.. ఐక్యతతో విజయాలు సాధించుకుందాం..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959