చేతికి కట్నం డబ్బులు ఇవ్వలేదని ఇద్దరినీ లాఠీ తో తరిమేసిన కానిస్టేబుల్..!

బాధ్యత కలిగిన కానిస్టేబుల్ సమాజానికి కొత్త నీతులు చెప్పాల్సింది పోయి కట్నం కోసం సొంత కొడుకుని కోడల్ని తరిమేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ఇంట్లో ఇంకా పెళ్లి పందిరి కూడా విప్పలేదు, పెళ్లి కళ పోలేదు. కొడుకు, కోడలు తన చేతికి కట్నం డబ్బులు ఇవ్వలేదని కానిస్టేబుల్ తండ్రి ఇద్దరినీ లాఠీ తో తరుముకుంటున్నాడు. తండ్రి, కొడుకులకు ఇద్దరికీ గొడవ జరుగుతోంది. ఏలూరులో ఈ సంఘటన జరిగింది. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. కొడుకు ఫిర్యాదు మేరకు కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నారు…ఈ. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..