మీ కాళ్ళు పట్టుకుంటాం దిగిపో.. ప్రైవేట్ డ్రైవర్లను వేడుకుంటున్న ఆర్టీసీ కార్మికులు…
వికారాబాద్ జిల్లా పరిగిలో రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె…
ప్రైవేటు బస్సులను ప్రైవేటు డ్రైవర్ల సహాయంతో పోలీసులు బందోబస్తు మద్య బయటకు వదిలిన ఆర్టీసీ అధికారులు..
బస్సులను అడ్డుకొని మీకు దండం పెడుతాం దిగిపో అంటూ ప్రైవేట్ డ్రైవర్లను కోరిన ఆర్టీసీ కార్మికులు..
బస్సులు బయటకు వెళ్లేసమయంలో బస్సుకో కానిస్టేబుల్ ని ఏర్పాటు చేసి పంపించిన పోలీసులు..
ఇదిలా ఉండగా ప్రస్తుతం బస్సు లేక పట్టణాల్లో తీవ్రస్థాయిలో ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు.. ప్రైవేటు డ్రైవర్లు అరకొర డ్రైవింగ్ చేస్తున్న ప్రజలకి సరిపడా రవాణా వ్యవస్థ లేకపోవడం కొత్త ఇబ్బందికరంగా మారింది… ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు..