నడి రోడ్డుపై ప్రియురాలిని దారుణంగా కొట్టిన ప్రియుడు… చోద్యం చూస్తున్న స్థానికులు… మానవత్వం మంట కలిసి పొయింది…!

నడి రోడ్డుపై ప్రియు రాలిని దారుణంగా ఎందుకు కొట్టాడు..!

నడి రోడ్డుపై ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌లో పెట్రోల్‌ నింపుతుండగా ప్రియురాలి మధ్య వాగ్వాదం జరగడంతో ప్రియుడు రెచ్చిపోయాడు. అందరి ముందే ఆమెను పట్టుకుని చితకబాదాడు. అక్కడ ఉన్న వారంతా వీడియోలు తీయడం తప్ప అతడిని ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు…

మానవత్వం మంట కలిసి పోయిందటానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ..

ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత దారుణంగా విచక్షణ రహితంగా కొడుతుంటే చేతులు కట్టుకొని సినిమా చూసినట్టుగా చూస్తున్నారు, స్థానికులు.. కనీసం ఆపే ప్రయత్నం చేయకపోగా, ఆ ఘటన జరుగుతున్నంతసేపు కూడా ఒకే దగ్గర కదలకుండా చేతులు కట్టుకొని చూస్తున్న వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో, చూస్తున్న వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…. ఆ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కడే చనిపోయి ఉంటే పరిస్థితి ఏమిటి.. శత్రువు ఆపదలో ఉన్నా కానీ ఆదుకోవాలి అనే ఒక సిద్ధాంతాన్ని చదువుకున్న మనం ఆ సిద్ధాంతాలన్నీ ఎటుపోయాయని ఆలోచన చేయాలి…