ఎన్నికల సమయంలో నేను ఏ పార్టీ నుండి పోటీ చేస్తానో చెప్తాను
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను
నన్ను ప్రజాక్షేత్రంలో తిరిగి పోటీ చేయమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది
ఎన్నికల షెడ్యూల్కు సిద్ధంగా ఉన్నాను.. దానం నాగేందర్..
సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించాను..
టెన్త్ షెడ్యూల్ ప్రకారం ఊరట ఉంటుందని లీగల్గా ప్రయత్నం చేశాను..
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా..
ఎన్నికలకు సిద్ధం అవుతాను.. ప్రజా క్షేత్రంలోకి వెళ్తాను అని దానం నాగేందర్ అన్నారు..
తెలంగాణ శాసనసభ సభ్యత్వ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని ఆయన తెలిపారు. చట్టపరమైన ప్రక్రియపై గౌరవంతోనే తాను న్యాయపోరాటం చేశానని, ఇకపై తన భవిష్యత్తును ప్రజా క్షేత్రంలోనే నిర్ణయించుకుంటానని స్పష్టం చేశారు. “కోర్టు తీర్పు ఈ విధంగా వస్తుందని నేను ముందే ఊహించాను. అయితే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (Anti-Defection Law) నిబంధనల ప్రకారం లీగల్గా నాకు కొంత ఊరట లభిస్తుందని భావించాను. అందుకే చట్టబద్ధంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను” అని దానం పేర్కొన్నారు…
ఖైరతాబాద్కి ఉపఎన్నిక అనివార్యమైనందున తన వ్యూహాలను దానం నాగేందర్ బయటపెట్టారు. ఉపఎన్నికల్లో తాను బరిలో దిగడం వంద శాతం ఖాయమని, అయితే ఏ పార్టీ గుర్తుపై పోటీ చేయాలనే అంశాన్ని ఇప్పుడు వెల్లడించనని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత, సమయానుకూలంగా తాను ఏ పార్టీ తరఫున బరిలోకి దిగేది స్వయంగా మీడియా ముఖంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు..అలాగే, తన తీరుపై వస్తున్న రాజకీయ ప్రచారాలకు దానం నాగేందర్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. గతంలో తెలంగాణ హైకోర్టు తన అనర్హతపై నెగెటివ్ తీర్పు ఇచ్చినప్పుడు కూడా తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేదని, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా సీఎంను కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ న్యాయపోరాటాన్ని తన వ్యక్తిగత చట్టపరమైన విషయంగానే చూశానని, రాజకీయ ఒత్తిళ్లతో ముడిపెట్టవద్దని కోరారు.