నేను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత కాలం ఎలాంటి గద్దలను, దోపిడీ దారులను, “క్రిమినలల్స్”ను తెలంగాణ ఆస్తుల మీద పడకుండా చూసుకుంటాను – భట్టి విక్రమార్క. . ABN రాధాకృష్ణ వీకెండ్ స్టోరీపై భట్టి విక్రమార్క సీరియస్
రాజకీయాల కోసం దిగజారుడు కథనాలు ప్రచారం చేసేంత వీక్ క్యారెక్టర్ కాదు నాది – భట్టి విక్రమార్క
ABN రాధాకృష్ణ మీద సాయంత్రం మళ్లీ మాట్లాడుతాను – భట్టి విక్రమార్క
రేవంత్ రెడ్డి మీద భట్టి విక్రమార్క ఘటు విమర్శలు
నేను గాలికి వచ్చిన వాడిని కాదు
40 సంవత్సరాలు సభ బయట, లోపల పోరాటం చేసి వచ్చాను
ఇలాంటి నీచ, నికృష్టపు, దిగజారిపోయి రాజకీయాల కోసం ఇలాంటి కథనాలు స్ప్రెడ్ చేసే వీక్ క్యారెక్టర్ నాది కాది – భట్టి విక్రమార్క.
నా మీద అబద్ధాలు రాసిన ABN రాధాకృష్ణకు చంద్రబాబు మీద, రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉండొచ్చు
లేదా నేను రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడుని కాబట్టి ఆయన మీద కోపం నా మీద చూపించడానికి రాసి ఉండొచ్చు
తన మీద వచ్చిన ABN కథనాలపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ స్టోరీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ స్టోరీలో రాధాకృష్ణ తనపై ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఈ 40 ఏళ్లలో తాను సమాజం మేలు కోసమే పనిచేశానని చెప్పారు. రాజకీయాల కోసం దిగజారుడు కథనాలు సృష్టించి, ప్రచారం చేసేంత వీక్ క్యారెక్టర్ తనది కాదని అన్నారు… తన మీద అబద్ధాలు రాసిన ఏబీఎన్ రాధాకృష్ణకు ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చునని భట్టి అన్నారు. లేదంటే తాను మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి సన్నిహితంగా ఉండేవాడినని, ఇప్పుడు ఆయన మీద కోపం రాధాకృష్ణ తనపై చూపించడానికి తప్పుడు కథనం రాసి ఉండొచ్చని చెప్పారు. కానీ తాను రాధాకృష్ణలా ఏదిపడితే అది మాట్లానని, ఏదీ పడితే అది రాయనని, ఎందుకంటే తనకు బాధ్యత ఉన్నదని వ్యాఖ్యానించారు.
రూ.1600 కోట్ల నైని కోల్ బ్లాక్ గనుల టెండర్ల కోసం గొడవ పెరిగి పెద్దదై ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ వరకు వెళ్లిందని రాధాకృష్ణ తన వీకెండ్ స్టోరీలో పేర్కొన్నారు. ఆ టెండర్ల రద్దు కారణంగానే మహిళా ఐఏఎస్ అధికారిణికి మంత్రితో సంబంధాలు అనే కథనం ఎన్టీవీలో ప్రచారం అయ్యిందని రాసుకొచ్చారు. దీని వెనుక భట్టి విక్రమార్క ఉన్నట్లు అనుమానం వ్యక్తంచేశారు.
దాంతో రాధాకృష్ణ ఆరోపణలను భట్టి విక్రమార్క తప్పుపట్టారు. తన మీద ఆరోపణలు వచ్చినందుకే నైని కోల్ బ్లాక్ గనుల టెండర్లను క్యాన్సిల్ చేశానని, మళ్లీ కొత్త టెండర్లు వేయండని సింగరేణి సంస్థకు చెప్పానని తెలిపారు. ఈ విషయంపై సాయంత్రం మళ్లీ మాట్లాడుతానని ఆయన అన్నారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959.