మేడారం కు వేలాదిగా భక్తులు…

R9TELUGUNEWS.COM: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం ఆదివారం కిక్కిరిసిపోయింది. భక్తులు వేలాదిగా తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. మహాజాతరకు ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. కల్యాణ కట్టల వద్ద తలనీనాలు సమర్పించుకున్నారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ఐటీ కమిషనర్ బాలకృష్ణ, బీజేపీ నాయకుడు తీన్మార్ మల్లన్న వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే మూడు లక్షలకు పైగా భక్తులు మేడారాన్ని సందర్శించారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.