డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్న ఇద్దరు యువకులు
ఓయో రూములో కలిశాక ఒక యువకుడిపై అఘాయిత్యం చేయబోయిన మరో యువకుడు.
నిరాకరించిన యువకుడిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడు.
హైదరాబాద్– మాదాపూర్ పరిధిలో డేటింగ్ యాప్ ద్వారా ఒక యువకుడితో పరిచయం ఏర్పడి, యాప్‌లో చాటింగ్ కొనసాగించిన వైద్యుడు.
ఇటీవల కలుసుకుందామని నిర్ణయించుకొని, ఓయో రూమ్ బుక్ చేసుకున్న యువకులు.
ఓయో రూములో యువకుడు తనపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించగా, నిరాకరించిన వైద్యుడు.
దీంతో వైద్యుడిపై దాడి చేసి, డబ్బులు ఇవ్వకపోతే రహస్యంగా కలిసిన విషయాన్ని బయటపెడతానని బెదిరించిన యువకుడు.
డబ్బులు ఇచ్చినా కూడా సదరు యువకుడు అతను పని చేసే ఆసుపత్రి వరకు వెళ్లి గొడవ చేయడంతో పోలీసులను ఆశ్రయించిన వైద్యుడు.
వైద్యుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
అసలు వివరాలు ఇది...
గ్రీండర్ డేటింగ్ యాప్ ద్వారా సదరు డాక్టర్‌కు ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ ఆ యాప్ ద్వారానే తరచూ చాటింగ్ చేశారు. ఇక ఒకానొక సమయంలో ఇద్దరు కలుసుకోవాలని నిర్ణయించుకుని.. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. ఇక కలుసుకున్న రోజు ఆ యువకుడు డాక్టర్‌పై అత్యాచారం చేయబోయాడు. దానికి డాక్టర్ ప్రతిఘటించడంతో.. అతడిపై కోపంతో దాడి చేశాడు నిందితుడు. అంతేకాదు తనకు డబ్బులు ఇవ్వకుంటే ప్రైవేట్‌గా కలిసిన విషయాన్ని బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో భయపడ్డ డాక్టర్.. అతడికి రూ. 5 వేలు ఇచ్చాడు. అంతటితో ఆగని నిందితుడు డాక్టర్‌ను ఫాలో చేసి.. అతడు పని చేస్తున్న హాస్పిటల్‌కి వెళ్లి న్యూసెన్స్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించాడు వైద్యుడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు..