లేటెస్ట్ న్యూస్ అప్డేట్…

దిల్లీ పోలీసులపై కాల్పులు జరిపిన 16 ఏళ్ల బాలుడు అరెస్టు...

దిల్లీలోని నంద్ నగరి ప్రాంతంలో పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో 16 ఏళ్ల బాలుడిని అధికారులు అరెస్టు చేశారు..

బైక్పై వెళుతున్న ఆ బాలుడు చెక్ పాయింట్ వద్ద మోహరించిన పోలీసు బృందంపై కాల్పులు జరిపాడని, అతని వద్ద పిస్టల్ ఉందని పోలీసులు తెలిపారు..

నిందితుడు, అతని సహచరుడు నెంబర్ ప్లేట్ లేని బైక్ నడుపుతున్నారని చెప్పారు.

రిజర్వేషన్లు ఖరారు.. తెలంగాణలో ఎన్నికల సందడి!

_హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది._

_అన్నీ అనుకూలిస్తే ఈ నెల 29వ తేదీన షెడ్యూల్‌ రిలీజ్‌ చేస్తామని పేర్కొంది. దీనికి అవసరమైన ఎలక్షన్‌ ప్లాన్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. నెల వ్యవధిలో ఎన్నికలు ముగించేలా ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రచురించినట్టు వెల్లడించింది._

_వార్డు సభ్యుడి నుంచి జెడ్పీ స్థానాల వరకు జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్లు రూపొందించారు. ఆయా నివేదికలను ఇవాళ సాయంత్రానికి ప్రభుత్వానికి అందజేస్తారు. వాటి ఆధారంగా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. అయితే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను త్వరలో డ్రా పద్ధతిలో నిర్ణయించారు.!.

10 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.

సెప్టెంబరు 25న దేశంలోని 10 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.

ఐఎండీ వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్, ఒడిశా, “ఆంధ్రప్రదేశ్”, జార్ఖండ్, కేరళ, గోవా రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

అదేవిధంగా, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఈ రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు..

వివాహం చేసుకుంటానని చెప్పి బిహార్లో 22 ఏళ్ల యువతిపై ఏడాదిన్నరగా బాబా లైంగిక దాడి

బిహార్ సహర్సాలో బాబా గోవింద్ ఝా అనే వ్యక్తి 22 ఏళ్ల యువతిని వివాహం చేసుకుంటానని ప్రలోభపెట్టి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడు.

ఆమె బెదిరింపులు, ఆందోళనతో ఏడాదిన్నర పాటు ఈ ఉచ్చులో ఉండిపోయినట్లు బాధితురాలు తెలిపారు.

ఆ మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సహర్సా రైల్వే స్టేషన్లో బాబాను అరెస్టు చేసి జైలుకు పంపారు.

యాదగిరిగుట్ట కొండపైకి రోప్డ్వే

#Telangana

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండపైకి వెళ్లే భక్తులకు మరింత మెరుగైన సదుపాయం కలగనుంది.

పర్వతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా గుట్టపైకి వెళ్లేందుకు రోప్వె ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

దీంతోపాటు రాష్ట్రంలో మరో మూడుచోట్ల రోవ్వేలను ఏర్పాటు చేయనున్నారు..

OG సినిమా షోలో విషాదం..

స్పీకర్ మీద పడి ఇద్దరు అభిమానులకు తీవ్ర గాయాలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏషియన్ థియేటర్లో ఘటన..

కెపాసిటీకి మించి 1200 మందిని థియేటర్‌లోకి అనుమతించడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యామని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అభిమానుల ఆగ్రహం..

డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్న ఇద్దరు యువకులు

ఓయో రూములో కలిశాక ఒక యువకుడిపై అఘాయిత్యం చేయబోయిన మరో యువకుడు

నిరాకరించిన యువకుడిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడు

హైదరాబాద్– మాదాపూర్ పరిధిలో డేటింగ్ యాప్ ద్వారా ఒక యువకుడితో పరిచయం ఏర్పడి, యాప్‌లో చాటింగ్ కొనసాగించిన వైద్యుడు

ఇటీవల కలుసుకుందామని నిర్ణయించుకొని, ఓయో రూమ్ బుక్ చేసుకున్న యువకులు

ఓయో రూములో యువకుడు తనపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించగా, నిరాకరించిన వైద్యుడు

దీంతో వైద్యుడిపై దాడి చేసి, డబ్బులు ఇవ్వకపోతే రహస్యంగా కలిసిన విషయాన్ని బయటపెడతానని బెదిరించిన యువకుడు

డబ్బులు ఇచ్చినా కూడా సదరు యువకుడు అతను పని చేసే ఆసుపత్రి వరకు వెళ్లి గొడవ చేయడంతో పోలీసులను ఆశ్రయించిన వైద్యుడు

వైద్యుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.