10 వార్డులో స్వయం
మారిన దృశ్యం..
కొండమల్లేపల్లి………..
కొండపల్లి లో 10 వార్డులో గంటలో మారిన దృశ్యం – సర్పంచ్, వార్డు సభ్యుడికి స్థానికుల కృతజ్ఞతలు..

ప్రజాప్రతినిధుల చొరవతో గంటలోనే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు కొండమల్లేపల్లి సర్పంచ్ యుగేందర్ రెడ్డి, 10వ వార్డు సభ్యుడు బిజిలి లింగం. సర్పంచి దృష్టికి తీసుకెళ్లిన మరుక్షణమే స్పందించి మండల కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో రైస్ మిల్లు వెనక భాగాన ఏళ్లుగా చెత్తాచెదారంతో నిండిన స్థలం గంట వ్యవధిలోనే శుభ్రంగా మారిపోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం 10 గంటల వరకు 10వ వార్డు పరిధిలోని ఈ ప్రాంతమంతా భయానకంగా ఉండేది. రైస్ మిల్లు వెనక ఖాళీ స్థలంలో చెత్త కుప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, నిలిచిన మురుగునీటితో దుర్వాసన గుప్పుమనేది. పందులు సంచరిస్తూ, దోమలు స్వైర విహారం చేస్తుండేవి. పక్కనే ఉన్న ఇళ్లలోకి, షాపుల్లోకి దుర్వాసన వస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడేవారు.
గంట తర్వాత వాతావరణం
సర్పంచ్ యుగేందర్ రెడ్డి, 10వ వార్డు సభ్యుడు బిజిలి లింగం ఆదేశాలతో జేసీబీలు, ట్రాక్టర్లు రంగంలోకి దిగాయి. ఉదయం 11 గంటల కల్లా చెత్త మొత్తం తొలగించి, మురుగునీటిని పారించి, స్థలాన్ని చదును చేశారు. ఇప్పుడు అదే స్థలంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. దేవరకొండ రోడ్డు కొత్త శోభ సంతరించుకుంది. పబ్లిక్, వాహనదారులు హాయిగా తిరుగుతున్నారు.
స్థానికుల స్పందన గంట క్రితం ఇక్కడ నిలబడాలంటేనే ముక్కు మూసుకునేవాళ్లం. ఇప్పుడు అదే స్థలం చూడముచ్చటగా ఉంది. మా 10వ వార్డుకు ఇది కొత్త ఊపిరి. సర్పంచ్ యుగేందర్ రెడ్డి గారికి, మా వార్డు మెంబర్ బిజిలి లింగం గారికి మా కృతజ్ఞతలు అని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధుల మాటల్లో
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. 10వ వార్డు ప్రజల సమస్య మా దృష్టికి వచ్చిన వెంటనే పనులు మొదలుపెట్టాం. ఇది మా బాధ్యత అని సర్పంచ్ యుగేందర్ రెడ్డి, వార్డు సభ్యుడు బిజిలి లింగం తెలిపారు…గంట క్రితం10వ వార్డులో దేవరకొండ రోడ్డు రైస్ మిల్లు వెనక చెత్తాచెదారంతో, నిలిచిన మురుగునీటితో దుర్భరంగా ఉన్న ఖాళీ స్థలం
గంట తర్వాత సర్పంచ్ యుగేందర్ రెడ్డి, 10వ వార్డు సభ్యుడు బిజిలి లింగం చొరవతో శుభ్రం చేసి చదును చేసిన అనంతరం అదే స్థలం. గంటలోనే ప్రాంత రూపురేఖలు మార్చేసిన పాలకులకు ప్రజలు హర్షం వెంకట్..
